హైద‌రాబాద్ లో కుండ‌పోత వ‌ర్షం..వాహ‌న‌దారులు అల‌ర్ట్‌

నవతెలంగాణ-హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. రాబోయే రెండు గంట‌ల పాటు అంటే 9 గంట‌ల వ‌ర‌కు న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. కాప్రా, ద‌మ్మాయిగూడ‌, ఈసీఐఎల్, నేరెడ్‌మెట్‌, ఎల్‌బీన‌గ‌ర్‌, ఉప్ప‌ల్, కొంప‌ల్లి, జీడిమెట్ల‌, దుండిగ‌ల్, జ‌గ‌ద్గిరిగుట్ట‌, కూక‌ట్‌ప‌ల్లి, ప‌టాన్‌చెరు, గ‌చ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, మియాపూర్, బేగంపేట్‌, ముషీరాబాద్‌, ఓయూ, తార్నాక‌, సరూర్‌న‌గ‌ర్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. వాహ‌న‌దారులు అల‌ర్ట్‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు. రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి వాహ‌న‌దారులు నెమ్మ‌దిగా రాక‌పోక‌లు కొన‌సాగించాల‌ని సూచించారు.

Spread the love