తమ్మినేని నామినేషన్‌కు తరలిరండి

నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
పాలేరు సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్మినేని వీరభద్రం నామినేషన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం ఖమ్మంరూరల్‌ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌ అన్నారు. తమ్మినేని నామినేషన్‌ జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని తెల్దారుపల్లి, తల్లంపాడు, పొన్నెకల్లు, మద్దులపల్లి, ఎం.వెంకటాయపాలెం, ఏదులాపురం, అరేంపుల, కాచిరాజు గూడెం, ఆరెకోడు, ముత్తగూడెం, ఏదులాపురం, పల్లెగూడెం గ్రామాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం నామినేషన్‌ కార్యక్రమానికి భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తున్నట్లు ప్రసాద్‌ వివరించారు. అనుక్షణం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసే కమ్యూనిస్టు నాయకులను అసెంబ్లీకి పంపాలన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి తమ్మినేనిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఖమ్మం నగరంలోని సిపిఎం కార్యాలయము సుందరయ్య భవనం నుంచి ర్యాలీ ప్రారంభమై ఖమ్మం కాల్వవొడ్డులోని ఖమ్మంరూరల్‌ తాసిల్దార్‌ కార్యాలయం వద్ద నామినేషన్‌ వేయడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకల్లా సిపిఎం శ్రేణులు సుందరయ్య భవనంకు చేరుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉరడీ సుదర్శన్‌రెడ్డి, పి.మోహన్‌రావు, తమ్మినేని వెంకట్రావు, సిద్దినేని కోటయ్య, బత్తినేని వెంకటేశ్వరరావు, యామిని ఉపేందర్‌, పి.సంగయ్య, వడ్లమూడి నాగేశ్వర రావు, కోటి శ్రీనివాస్‌, కర్లపూడి వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, దండ్యాల వెంకటేశ్వర్లు, మద్ది వెంకటరెడ్డి, కొండం కరుణాకర్‌, ఏపూరి వర కుమార్‌, పాపిట్ల సత్యనారాయణ, పెంట్యాల నాగేశ్వరరావు, నువ్వుల నాగేశ్వర రావు, వట్టికోట నరేష్‌, వల్లూరి సీతరామిరెడ్డి, తిరపయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love