ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం . కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తోందన్నారు. మా ఇంటిపై మీ గూండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. ఆ రోజు మా అమ్మ ఒక్కతే ఇంట్లో ఉన్న సంగతి తెలిసే గూండాలను దాడికి పంపించావన్నారు. కరోనాతో తెలంగాణ ప్రజలు లక్షలు ఖర్చు చేసినప్పుడు ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. అప్పుడు ప్రజలకు ఒక్కరూపాయి అయినా సాయం చేశారా? అని నిలదీశారు. ‘నిన్ను కుక్కా అన్నా.. జైలులో వేసినా ప్రజల నుంచి సింపతీ ఏమీ రాదు. మనిషి బతికున్నప్పుడు సాయం చేయరు కానీ చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా చేస్తారా?’ అని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు.

Spread the love