- Advertisement -
నవతెలంగాణ -పరకాల
మాజీ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య ధర్మపత్ని దొమ్మటి కళావతిని రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని గ్లెనెగల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఎంపీ స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆమెకు గుండె శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో, ప్రస్తుతం అందుతున్న వైద్యం మరియు కోలుకుంటున్న తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కళావతి త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ ఆకాంక్షించారు. సాంబయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
- Advertisement -



