Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాది కూలీలకు అవగాహన కల్పించిన ఎంపీడీఓ

ఉపాది కూలీలకు అవగాహన కల్పించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ కూలీలకు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఖండేబల్లూర్, గ్రామ పరిధిలోని శివారు ప్రాంతంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ఎంపీ ఓ రాము స్థానిక సర్పంచ్ చాకలి కృష్ణ తో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎండలు పెరుగుతున్నందున కూలీలకు త్రాగునీరు , హెల్త్ కిట్లు , నీడ , ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ న ఆదేశించారు.

అదేవిధంగా మైబాపూర్ గ్రామాలలో మైబాపూర్ గ్రామంలో ఎంపీడీవో శ్రీనివాస్ కూలీలతో సమావేశం నిర్వహించారు. వారికి పలు ఆరోగ్య జాగ్రత్తలు సూచించారు. ఎండలు తగిలినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసిన చికిత్స పనులను వారికి వివరించారు. ప్రతి ఒక్కరు కొలతల ప్రకారమే పనులు చేయాలని అన్నారు. అదేవిధంగా కూలీల సంఖ్యను పెంచే విధంగా గ్రామాలలో  ఫీల్డ్ అసిస్టెంట్ ను అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పెద్ద మొత్తంలో కూలీలు పనులకు వచ్చే విధంగా వారికి సహకరించాలని ఫీల్డ్ అసిస్టెంట్ ను ఆదేశించారు. కార్యక్రమంలో ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ, ఉప సర్పంచ్, జిపి పాలకవర్గ సభ్యులు, జిపి కార్యదర్శి, మైబాపూర్ గ్రామ సర్పంచ్ బస్యవ్వ ఆశోక్ రెడ్డి, ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -