Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో

గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  :  జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, జపి రికార్డులను, అభివృద్ధి పనులను జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ ఎంపివొ రాము బుదువారం నాడు పరీశీలించడం జరిగిందని గ్రామ సర్పంచ్ రమణమ్మ సురేష్ గొండ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. తాగునీటి కొరకై రెండో వార్డ్, మూడవ వర్డ్లలో సింగల్ ఫేస్ మోటర్ ద్వారా పైప్ లైన్ చేసి నల్లలు బిగించడం జరిగిందని అన్నారు. వీటితో పాటు స్మశాన వాటికను పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయం కి చేరుకొన ఎంపీడీవో, ఎంపీఓ రికార్డులను పరిశీలించినారు. వీరితోపాటు గ్రామ సర్పంచ్, రమణ సురేష్ గొండ, గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, భారద్వాజ్, కారోబారి, గంగారం, సిబ్బంది, వీరయ్య, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -