మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్  చేయాలి 

– బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఆయన విమర్శించారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో మాట్లాడుతూ పట్టణాల్లో నగరాల్లో ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమించే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని 2016లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని ఆయన చెప్పారు.అదేవిధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్మూర్ మున్సిపల్ లో పని చేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ హామీ ప్రకారం ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసే లోపు, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ సప్లయ్ గార్డెన్స్ స్ట్రీట్ లైట్స్ కార్మికులకు కనీస వేతనం ఖమ్మం రామగుండం ఇతర మున్సిపల్ కార్పొరేషన్ లలో కనీస వేతనం 19500 అమలు చేస్తున్నారని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.  ఆర్మూర్ మున్సిపల్ లో కనీస వేతనం అమలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 8 నెలల పీఆర్పీ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగాద సిద్దిరాములు, బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బిఎల్ టియు జిల్లా అద్యక్ష, కార్యదర్శులు కె.మధు,ఎం.రాజేందర్, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గంగా శంకర్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శి నవీన్,ఎం.ఎల్లం, వాటర్ సప్లయ్ గార్డెన్స్ స్ట్రీట్ లైట్స్ యూనియన్ అధ్యక్ష , కార్యదర్శి రాహుల్, హరీష్, బహుజన శ్రామిక మహిళా సంఘం కన్వీనర్ ఆశాబాయ , ఆర్మూర్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శి శ్రీను, రాజన్న, నాయకులు రాజ గంగారాం తదితరులు పాల్గొన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతుల ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామన్నారు.నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ సప్లయ్, గార్డెన్స్, స్ట్రీట్ లైట్స్ కార్మికులకు పని ప్రదేశంలో వాడే పరికరాలు ఇవ్వాలి. పని భారం తగ్గించాలి. డ్రైవర్స్ కు వాహనాలు రిపేర్ సందర్భంగా బిల్లులు ఎక్కువ అవుతున్నాయని వేధింపులు ఆపాలి.వాహనాలు రిపేర్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ షెడ్ నిర్వహించాలి. ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ ప్రకటించిన 8 నెలల పీఆర్పీ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆర్మూర్ మున్సిపల్ గా ఏర్పడిన నుండి పీఎఫ్ లోని లోపాలను సరిచేయడానికి ప్రత్యేక అధికారిని నియమించి నెలరోజుల్లో పరిష్కారం చేయాలి,వెంటనే ఈఎస్ఐ అమలు చేయాలి,నెలనెలా వేతనాలు ఇవ్వాలి.అర్హులైన మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
Spread the love