మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీస్

– పిఎఫ్ డబ్బులు కోటి పైనే నిల్వ
– జమ చేయని అధికారులు
నవతెలంగాణ నసురుల్లాబాద్

బాన్సువాడ మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నేడు సిఐటియు నేత కలిల్  ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్ సిఐటి నాయకుడు ఖలీల్ మాట్లాడుతూ  మున్సిపాలిటీ కార్మికుల శ్రమను ప్రభుత్వం శ్రమదోపిడి చేస్తుందని, కార్మికుల సమస్యలను పరిష్కారం కొరకు ఎన్నో సంవత్సరాల నుండి మున్సిపల్ కార్మికుల హామీలను పరిష్కరించడం లేదు. బాన్సువాడ మున్సిపాలిటీలో సుమారు 158 మున్సిపల్ కార్మికులు  పనిచేస్తారు. ఇందులో సుమారుగా  100 మందికి మాత్రమే పిఎఫ్ నంబర్ ఉంది, ఈ వందమంది కూడా ఒక సంవత్సరం పిఎఫ్ మాత్రమే చెల్లించారు. మిగతా ఐదు సంవత్సరాల పిఎఫ్ డబ్బులు మున్సిపాలిటీ ఖాతా లోనే  ఉన్నాయి . ఐదు సంవత్సరాల నుండి పీఎఫ్ చెల్లించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పిఎఫ్ డబ్బులను వెంటనే చెల్లించి కార్మికులకు ఆదుకోవాలని అన్నారు. మిగతా 58 మందికి   పిఎఫ్ అన్ లైన్  చేసి వారికి కూడా వచ్చేలా చూడాలన్నారు. కార్మికుల వేతనం నుండి నెలకు  సుమారు 12వందల  రూపాయలను కట్ చేస్తున్నారు. అలాగే మున్సిపల్ నుండి వేసే వెయ్యి రూపాయలు కూడా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరే ఉన్నాయని అన్నారు.  మున్సిపాలిటీ అధికారులు అందరి పిఎఫ్ కడితే సంవత్సరానికి మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికుల పిఎఫ్ జమ ఉన్న డబ్బులు జమా అవుతాయని అన్నారు.
అధికారులు చేస్తున్న తప్పుకు మున్సిపాలిటీ కార్మికులు ఎంతో నష్టపోతున్నారు మరియు 158 మంది కార్మికుల ఈఎస్ఐ కూడా కట్టలేదన్నారు.  సుమారు మున్సిపల్ కార్మికుల పైసలు మున్సిపాలిటీలో కోటి యాభై లక్షల రూపాయలు ఉన్నాయని అన్నారు. మరియు ఇప్పటికీ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులు ఆరుగురు చనిపోయరని,  నాలుగు సంవత్సరాలు అవుతున్న మున్సిపాలిటీ అధికారులు ఇంతవరకు  వేతనం కు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదన్నారు.  అనేక సమస్యలతో మున్సిపల్ కార్మికులు  పనిచేస్తున్న వాళ్ళ సమస్యలను  అధికారులు పట్టించుకోవడం  లేదు. ఇప్పటికైనా మున్సిపల్  కార్మికుల సమస్యలను పట్టించుకోని వాళ్ళ సమస్యలు తీరుస్తే మంచిది లేకపోతే కచ్చితంగా 14 రోజుల తర్వాత సమ్మెలోకి  వెళ్తామని మున్సిపల్ అధికారులకు నోటీస్ ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఖలీల్ బాన్సువాడ మున్సిపాలిటీ అధ్యక్షుడు బుజ్జి,  సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు

Spread the love