మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం

– ఘనంగా పంచముఖి మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం
– అందరం ఒకే చోట కలుసుకోవడం సంతోషంగా ఉంది
– అధ్యక్ష కార్యదర్శులు హరిదాసు సాయి రెడ్డి, కులచారి సంతోష్
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
కుల బంధువులందరూ ఆత్మీయ సమ్మేళనంలో ఒకే చోట కలుసుకోవడం సంతోషంగా ఉందని, అందరినీ కలుసుకోవడం ఎంతో అనుభూతిని కలిగిందని అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో వంద ఫీట్ల రోడ్ లోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న పంచముఖి మున్నూరు కాపు సంఘం భవనంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవము, మున్నూరు కాపు కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనము  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 90 మంది సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని అధ్యక్షులు, కార్యదర్శి కోశాధికారి, నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించి, ఇంటి పెద్ద యజమానికి కండువా కప్పి కుటుంబ సభ్యుల వివరాలు ఒకరికొకరు పంచుకున్నారు. ఓవర్ వెయిట్ క్యాటగిరి లో ఎస్ జీ ఎఫ్ తైక్వాండో లో స్టేట్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి, జాతీయ స్థాయి కి ఎంపికైన వైసాక్షి సంతోష్ కుమార్తె అక్షర ను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం నూతన కార్యవర్గం అధ్యక్షులుగా హరిదాసు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కులచారి సంతోష్, కోశాధికారిగా యేల్మల శంకర్, గౌరవాధ్యక్షులుగా బొబ్బిలి కిషన్, బంటు గంగాధర్, ముఖ్య సలహాదారులుగా ఆకుల శ్రీశైలం,ఆమ లడ్డు శంకర్, పెద్ద కాపు లుగా హరిదాసు మారుతి, దారం పోతన్న, ఉపాధ్యక్షులుగా నాగుర్త ధర్మేందర్, వైశాక్షి సంతోష్, కార్యనిర్వహణ కార్యదర్శులుగా కర్క రమేష్, ముకుందం శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా ముద్ధం ఆంజనేయులు, నక్క రఘునందన్, సోమిరెడ్డి జగదీష్, సలహాదారులుగా కోళ్ల సురేందర్, పుప్పాల ప్రదీప్, పంతుల ముత్యం, కార్యవర్గ సభ్యులుగా తోట నరేష్, బొల్లం అంజి రెడ్డి, ఆకుల తిర్మల్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు హరిదాసు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుల చారి సంతోష్, కోశాధికారి యేల్మల శంకర్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల క్రితం సంఘాన్ని ప్రారంభించామని, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సంఘ  భవనాన్ని నిర్మించుకున్నామని మొదట బాబన్న, సాయి రెడ్డి, రఘునందన్, మారుతి లతో కలిసి ప్రారంభమైన పంచముఖి మున్నూరు కాపు సంఘము 90 మంది సంఘ సభ్యులుగా చేరడం సంతోషంగా ఉందని అన్నారు. కుల బంధువులందరూ ఒక వేదిక మీద కలిసి భోజనం చేయాలంటే ఉద్దేశంతో, మంచి చెడ్డ పంచుకోవాలని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి కుటుంబ సభ్యులతో హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తామని అన్నారు. సంఘం అభివృద్ధి కోసం ఎల్లవేళలా పాటుపడతామని, సంఘ సభ్యులకు అందుబాటులో ఉండి సంఘాన్ని మరింత అభివృద్ధి అయ్యేలా మా వంతు తోడుపాటునందిస్తామన్నారు. అనంతరం సంఘ సభ్యులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సభ్యులు మాజీ తొలి మహిళ మేయర్ ఆకుల సుజాత, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు లక్ష్మి, శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం సభ్యులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.
Spread the love