నవతెలంగాణ – దర్పల్లి
ధర్పల్లి మండల కేంద్రములోని ఎన్టీఆర్ కాలనీ ముస్లిం కమిటీ ఇటీవల నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఊపాఅధ్యక్షులు ఆర్మూర్ బాల్ రాజు నేతృత్వంలో నూతన కార్యవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. అనంతరం పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎన్టీఆర్ కాలనీ మూషిక సంఘం కమిటీ అధ్యక్షులు జమీల్,ఉపాధ్యక్షులు ఖలీల్, కోశాధికారి ముజీద్, కార్యవర్గ సభ్యులు రజాక్,సాధక్, షారుఖ్, వాజీద్, కరీం, మొహసీన్, అబ్దుల్ ఖలీల్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన ముస్లిం కమిటీ కార్యవర్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



