Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటల కొనుగోళ్లలో కేంద్రం అలసత్వం

పంటల కొనుగోళ్లలో కేంద్రం అలసత్వం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆలసత్వం వహిస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొనుగోళ్ళు చేస్తోందని తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే రైతులకు ఇబ్బందులు దూరం అవుతాయని అన్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, సన్ ఫ్లవర్ పంట కొనుగోళ్ళు జరుగుతున్నాయని, ఇప్పటికైనా కేంద్రం అలసత్వం వీడి పూర్తి సహకారం అందించి, ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.కార్యక్రమంలో మద్నూర్ సింగిల్ విండో పర్సన్ ఇంచార్జ్ శ్రీనివాస్ పటేల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -