Monday, May 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధికి రూ. 80 లక్షలు మంజూరు

గ్రామాభివృద్ధికి రూ. 80 లక్షలు మంజూరు

- Advertisement -

నూతన జీపీ భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి
నవతెలంగాణ-మద్నూర్

మండలంలోని చిన్న ఎక్లారా గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు మల్లికార్జున్ మాలి పటేల్, బసవరాజ్ పటేల్, గన్ను పటేల్, నందు పటేల్, మాజీ ఎంపిటిసి సంజు లు కలిసి విన్నవించారు. ఈ మేరకు వెంటనే ఎమ్మెల్యే స్పందించిన ఎమ్మెల్యే నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి రూ. 20 లక్షల నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా గ్రామంలోని అంతర్గత సీసీరోడ్ల నిర్మాణానికి, వరదనీటి కాలువ నిర్మాణానికి, కల్వర్టు నిర్మాణానికి, అత్యవసరమైన సమస్యల పరిష్కారానికి మరో రూ.60 లక్షల నిధులు మంజూరు చేసి గ్రామ సమగ్రాభివృద్ధికి పాటు పడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ మాలి పటేల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు గ్రామ పంచాయతీ నూతన కార్యాలయ భవన నిర్మాణం పూర్తైంది. ఇందులో భాగంగా ఈనెల 13న ఎమ్మెల్యే చేతుల మీదుగా బిల్డింగ్ ప్రారంభోత్సవం జరగనుందని, మల్లికార్జున్ పటేల్, మాజీ ఎంపిటిసి సంజీవ్ లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -