Saturday, July 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగడువులోగాసర్ ను పూర్తి చేయాలి

గడువులోగాసర్ ను పూర్తి చేయాలి

- Advertisement -


సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ 
 డాక్టర్‌ పవన్ కుమార్ శర్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డాక్టర్‌ పవన్ కుమార్ శర్మ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై ఆయన శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, ‌జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లాల ఎన్నికల అధికారులు(డిఇఓలు), ఓటరు జాబితా పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజెషన్ ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. సర్ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన జిల్లాల ఎన్నికల అధికారులు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను ఇతర జిల్లాల అధికారులు అనుసరించి ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం పర్యవేక్షించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -