చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
తరగతులు ప్రారంభమై నెల రోజులైన గుర్తింపేది?
వెయ్యికి పైగా ప్రయివేటు జూనియర్ కాలేజీల
దరఖాస్తులు పెండింగ్
నిబంధనల మేరకే ముందుకెళ్తున్నామంటున్న అధికారులు
ప్రతి ఏడాదిలాగే ఈ సారి జాప్యమే..
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా ప్రయివేటు వ్యక్తులు జూనియర్ కాలేజీలు నడిపించు కోవాలంటే ముందుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అనుమతి పొందాలి. తగిన పత్రాలు సమర్పిస్తే బోర్డు గుర్తింపునిస్తుంది. ఆ తర్వాత ప్రవేశాలు చేపట్టి విద్యార్థులను చేర్చుకోవాలి. కానీ మన రాష్ట్రంలో మాత్రం సీన్ రివర్స్. ముందుగా అడ్మిషన్లు తీసుకుంటారు. విద్యార్థులను చేర్చుకుంటారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జారీ చేసే అకడమిక్ క్యాలెండర్ కు సంబంధం లేకుండా తరగతులను కూడా ప్రారంభిస్తారు. ఒకవైపు అనుమతి కోసం తిరుగుతూనే మరోవైపు విద్యార్థులకు చదువు చెబు తుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్రంలో ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో ఆయా కళాశాలల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే గుర్తింపు ప్రక్రియను చేపట్టినా ఇప్పటికీ రాష్ట్రంలో వెయ్యికి పైగా ప్రయివేటు జూనియర్ కళాశాలలు అనుమతి లేకుండా కొనసాగు తున్నాయంటే పరిస్థితి ఎంతగా దిగ జారిందో అర్థం చేసుకోవచ్చు. పేరుగాంచిన కార్పొరేట్ కాలేజీల నుంచి బడ్జెట్ కాలేజీల వరకు చాలా వరకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. దాదాపు 1,350 వరకు జూనియర్ కళాశాలలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం 250 జూనియర్ కాలేజీలకు మాత్రమే అనుమ తినిచ్చారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనైతే ఒకట్రెండు కాలేజీలు మినహా మిగిలిన కాలేజీలు గుర్తింపు కోసం పడి గాపులు కాస్తున్నాయి. అయితే నిర్దేశిత నిబం ధనలను పూర్తి చేయకపోవడం, అనుమతికి అవసరమైన పత్రాలను సమర్పిం చకపోవడమే ఆలస్యానికి కారణమని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా వాటిలో దాదాపు అన్ని కళాశాలలకు గుర్తింపు లభించింది. మరోవైపు కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ తదితర కళశాలలకు కూడా పెద్ద ఎత్తున గుర్తింపు లభించింది. ప్రయివేటు జూనియర్ కాలేజీలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరం నాటికి 1,405 కాలేజీలకు అనుమతి నిచ్చారు. కానీ ఈ ఏడాది మాత్రం వాటికి గుర్తింపు రావటం కష్టంగా మారింది. ముఖ్యంగా మల్టీ కాంప్లెక్స్ భవనాల్లో నిర్వ హిస్తున్న కాలేజీలు సమర్పించిన పత్రాలేవి సరిగ్గా లేవనీ, వాటిని సవరించి, తిరిగి సమర్పించాలని అధి కారులు వెనక్కి పంపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆ కళా శాలలకు గడువు విధించి ధృవపత్రాల సమర్పణకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంట ర్మీడియట్ డైరెక్టర్ అభిలాష అభినవ్… వేగంగా తనిఖీలు పూర్తి చేసి గుర్తింపు ప్రక్రియను ముగించాలని జిల్లా ఇంట ర్మీడియట్ అధికారులను ఆదేశించారు. కాగా అనుమతికి సంబం ధించి ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 29లోని రూల్స్, ఇతర నిబంధనలను పూర్తి చేయ డంలో ప్రయివేటు కాలేజీలు అపసోపాలు పడు తున్నాయి. మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కఠినంగా వ్యవహ రిస్తుండటం, విస్తృత తనిఖీలు చేపట్టటంతో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతటి ఇరుకు ప్రదేశాలు, భవనాల్లో ప్రయివేటు కళా శాలలను నిర్వహి స్తున్నారనేది వారి తనిఖీల్లో స్పష్ట మవుతోంది. మే 31తో ఇంటర్మీడియట్ మొదటి దశ ప్రవేశాలు ముగిశాయి. రెండో దశలో చేరేందుకు విద్యా ర్థులకు బోర్డు మరో అవకాశం కల్పించింది. వారిని ఆయా కళాశాలల్లో చేర్చే ముందు వాటికి ఇంటర్మీడియట్ బోర్డు అనుమతి ఇచ్చిందా? లేదా? అనే విషయాన్ని నిర్దారించు కోవాలంటూ ఉన్నతా ధికారులు.. తల్లిదం డ్రులకు సూచి స్తున్నారు. అయినా అనుమతి లేని వెయ్యికి పైగా కాలేజీల్లోనే లక్షలాది మంది విద్యార్థులు చదువు తుండటం గమనార్హం. ఆ కాలేజీల్లో వేటికి గుర్తింపు లభిస్తుందో? వేటికి లభించదో? ఏయే కళాశాలల గుర్తింపును రద్దు చేస్తారో? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా విద్యార్థుల భద్రత, పరిశుభ్రత తదితర సౌకర్యాల రీత్యా అనుమతి ప్రక్రియ కోసం ఇంటర్ బోర్డు పలు నిబంధనలను విధించిన సంగతి తెలిసిందే. గత ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీతో పాటు బిల్డింగ్ స్ట్రక్చరల్ సేఫ్టీ సర్టిఫికెట్. శానిటరీ సర్టిఫికెట్, ల్యాండ్ డాక్యుమెంట్లు / లీజ్ అగ్రిమెంట్, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ వివరాలు, ల్యాబ్, లైబ్రరీ ఫొటోలు తదితర నిబంధలను ప్రయివేటు కాలేజీలు పాటించాల్సి ఉంది.
అనుమతి లేని ప్రయివేటు కాలేజీల దందా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


