కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను..

నవతెలంగాణ హైదరాబాద్: “కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను” అనగానే సభ ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. చంద్రబాబు నాయుడు తరువాత ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. “కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను” అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతకరణ సుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రామాణం చేశారు. “కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను” అనే నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, లేదా నాకు తెలియ వచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికి, వ్యక్తులకు తెలియజేయనని దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలిచిన జనసేనకు చంద్రబాబు క్యాబినెట్ లో జనసేన కు మూడు మంత్రి పదవులు వచ్చాయి. 10 ఏండ్ల పాటు పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని..2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ కల్యాణ్ కు తగిన ఫలితం దక్కింది. ఇన్ని సంవత్సరాలు వేచి చూసిన అభిమానుల కల నెరవేరిన వేళ పవన్ ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు ఆనందంలో మునిగి పోయారు.

Spread the love