ముగిసిన నాగిరెడ్డిపేట్ వైస్ ఎంపీపీ ఎన్నిక..

– నాగిరెడ్డిపేట్ వైస్ ఎంపీపీ బీఆర్ఎస్ కైవసం..
– వైస్ ఎంపీపీ గా ఎన్నికైన పోచారం ఎంపీటీసీ టేకులపల్లి వినీత..

– వైసీపీ ఎన్నికలు మూడు ఓట్ల తేడాతో విజయం సాధించిన పోచారం ఎంపీటీసీ..
– ఆనందంతో మండల కేంద్రంలో టపాసులు కాల్చిన టిఆర్ఎస్ నాయకులు..
– ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ వైస్ ఎంపీపీని అభినందించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో  బుధవారం రోజు వైస్ ఎంపీపీ ఎన్నిక రిటర్నింగ్ అధికారి వీరస్వామి నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ఎన్నికకు తొమ్మిది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. బొల్లారం ఎంపీటీసీ ఊర లావణ్య పోచారం ఎంపీటీసీ టేకులపల్లి వినీత వైస్ ఎంపీపీ బరిలో నిలిచారు. బొల్లారం ఎంపీటీసీ ఊర లావణ్య కు తాండూర్ ఎంపీటీసీ రాజదాస్ ప్రతిపాదించగా జనగం పల్లి ఎంపీటీసీ సుజాత బలిపరిచారు. అదేవిధంగా పోచారం ఎంపీటీసీ టేకులపల్లి వినీత బరిలో నిలవగా ఆత్మకూరు ఎంపీటీసీ మోతే శ్రీను ప్రతిపాదించారు ఎంపిటిసి ఉప్పల నారాయణ ఆమెను బలపరిచారు. అనంతరం వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించగా జాన్కంపల్లి ఎంపీటీసీ ఊర లావణ్య కు మూడు ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా పోచారం ఎంపీటీసీ టేకులపల్లి వినీతకు ఆరు ఓట్లు రావడంతో వైస్ ఎంపీపీగా  పోచారం ఎంపీటీసీ టేకులపల్లి వినీత ఎన్నికయ్యారు. ఎన్నికకు సంబంధించిన వివరాలను సీఈఓ కు పంపనున్నట్లు రిటర్నింగ్ అధికారి వీరస్వామి తెలిపారు.
గత నాలుగున్నర సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఫలితం దక్కేనా..
2019 ఎంపీటీసీ ఎన్నికల్లో పదిమంది ఎంపీటీసీలుగా నాగిరెడ్డిపేట మండలానికి ఎన్నిక కావడం జరిగింది. ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు బిఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం పదిమంది ఎంపిటిసిలుగా ఎన్నిక కావడం జరిగింది. అనంతరం ఎంపీపీ ఎన్నికల నిర్వహించగా పోచారం ఎంపీటీసీ వినీత కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీపీ బరిలో నిలవగా ధర్మారెడ్డి ఎంపీటీసీగా గెలిచిన కృష్ణవేణి కూడా ఎంపీపీ బర్రెలను నిలవడం జరిగింది. పోచారం ఎంపీటీసీ టేకులపల్లి వినీతకు ఐదు ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా ధర్మారెడ్డి నుండి బరిలో నిలిచిన కృష్ణవేణికి కూడా ఐదు ఓట్లు రావడంతో ఇద్దరికీ సమానం ఓట్లు రావడంతో డ్రా చేయడ జరిగింది. అందులో ధర్మ రెడ్డి ఎంపీటీసీ కృష్ణ వేణికి ఎంపీపీగా అదృష్టం వరించింది. ఎంపీపీ అయినా కొద్ది రోజుల్లోనే ఆమె హఠాత్ మరణం చెందడం తోటి ఎంపీపి స్థానం ఖాళీగా అవ్వడం జరిగింది. వైస్ ఎంపీపీగా ఉన్న తాండూర్ ఎంపీటీసీ రాజదాస్ ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇన్చార్జి ఎంపీపీగా కొనసాగిన దివిటి రాజుదాస్  పై గత మూడు నెలల క్రితం ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానంలో ఎంపీటీసీలు విజయం సాధించడం తో ఎంపీపీ స్థానం ఖాళీగా అవ్వడం జరిగింది. గత పది రోజుల క్రితం వైస్ ఎంపీపీ కి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం రోజు మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఇందులో పోచారం ఎంపీటీసీ వినీత వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. బీ ఆర్ఎస్ పార్టీ తరఫున వైస్ ఎంపీపీ టేకులపల్లి వినీత విజయం సాధించడంతో బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకొని వైస్ ఎంపీపీగా ఎన్నికైన టేకులపల్లి వినీత తోపాటు తోటి ఎంపీటీసీలను అభినందించారు.
Spread the love