ఇసుకపై నాలేశ్వర్ వీడిసి పెత్తనం..

– రెవెన్యూ అనుమతి వున్న వీడీసీ దౌర్జన్యం..
– ఇసుక ట్రాక్టర్లను ఆపి డ్రైవర్ల పై దాడి ఆపై విడిసి భవనంలో ట్రాక్టర్ల  బంది..
– వీడీసీకి కాసులు కురిపిస్తున్న ఇసుక..
– ప్రేక్షక పాత్రలో అధికార యంత్రాంగం
నవతెలంగాణ – నవీపేట్
గ్రామ శివారులోని ఇసుకపై గ్రామాభివృద్ధిదే పెత్తనం అంటూ రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం చేసిన సంఘటన నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గృహ నిర్మాణం కోసం మండలంలోని బినోల గ్రామస్తులు రెవెన్యూ అధికారుల నుండి అనుమతులు తీసుకొని సోమవారం నాలేశ్వర్ వాగు నుండి ఇసుకను తరలిస్తుండగా నాలేశ్వర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ డ్రైవర్ల పై దాడి చేసి మూడు ట్రాక్టర్లను గ్రామాభివృద్ధి భవనంలో సోమవారం బంధించిన సంఘటన చోటుచేసుకుంది. బినోల గ్రామస్తులు పది ట్రాక్టర్ల ఇసుక కోసం మూడు ట్రాక్టర్లతో చాలాన్లను రెవెన్యూ అధికారులకు చెల్లించి నిజాంపూర్, నాలేశ్వర్ వాగుల నుండి ఇసుకను తరలించేందుకు అనుమతులు పొందారు. సోమవారం అనుమతుల మేరకు నాలేశ్వర్ వాగు నుండి  మూడు డాక్టర్లలో ఇసుకను  తరలిస్తుండగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అడ్డుకొని రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మా గ్రామం నుండి ఇసుకను తరలించేందుకు ఒప్పుకోబోమని పెత్తనమంతా మాదేనని ఎవరు వచ్చిన వినేది లేదని కరాకండిగా చెప్పి ట్రాక్టర్ డ్రైవర్లపై దాడి చేసి మూడు ఇసుక ట్రాక్టర్లను వి డి సి కమిటీ హాలులో బంధించినట్లు బాధితులు తెలిపారు. ఇసుకపై రెవెన్యూ, మైనింగ్ సంబంధిత అధికారుల అనుమతులు పొందిన తమను దౌర్జన్యంగా బంధించడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకపై నాలేశ్వర్ వీడిసి పెత్తనం చెలాయించడం పట్ల జిల్లా అధికార యంత్రాంగం స్పందించి వీడిసిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Spread the love