ప్రచారంలో దూసుకెళ్తున్న నర్రా

నవతెలంగాణ హైదరాబాద్:  ఉప్పల్ నియోజకవర్గంలో విద్యార్ధుల రాజకీయ పార్టీ అభ్యర్ధిగా క్రికెట్ బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తున్న యువకుడు, విద్యావంతుడు నర్రా సుఖేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిరుపేద కుటుంబం నుంచి కష్టపడి చదువుకుని పైకి వచ్చిన విద్యావంతుడు. విద్యా, వైద్యం అందరికి అందించాలని నిరంతరం తపన పడే వ్యక్తిగా నేడు ఎన్నికల బరి తన స్పష్టమైన విజన్ తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత పదేండ్లగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మంచి వైద్యం అందిస్తూ ప్రజల మనసుల్లో స్ధానం పొందారు నర్రా సుఖేందర్ రెడ్డి.  ఆయన తన విజన్ ను ప్రకటించారు.
విద్యాభివృద్ధి 
ఉప్పల్ నియోజకవర్గం లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ తరహాలో ఆధునికరించి వాటిలో నాణ్యమైన విద్య బోధన అందేలా చర్యలు తీసుకుంటాను ఇదే కాకుండా కాప్రా ప్రాంతంలో జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తాను. ఉప్పల్లోని ప్రభుత్వం డిగ్రీ కళాశాలకు భవనాన్ని నిర్మించి విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్స్ ను ఏర్పాటు చేయించి పరిశోధనలకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తా.
యువతకు ఉపాధి
నియోజకవర్గంలో ఏ ఒక్క యువతి యువకుడు ఖాళీగా లేకుండా వారికి కావలసిన ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తాను.
అందుకోసం వారిని నైపుణ్యలుగా తీర్చిదిద్దెందుకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయించి ఉచితంగానే వసతి కల్పించి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది.
నియోజకవర్గాన్ని మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాలను మించే విధంగా ఐటీ కారిడారులుగా తీర్చిదిద్ద డం జరుగుతుంది.
ఇప్పుడున్న పారిశ్రామిక వాడాలన్నీ కూడా ఐటీ కంపెనీలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను.
స్థానిక యువతకు కావాల్సిన ఉద్యోగాలను ఇచ్చే విధంగా చేస్తాను.

వైద్య సేవలు
వైద్యం అనేది పేద, మధ్యతరగతి వర్గాలకు అందని పండుగ మారింది.
ప్రస్తుత ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సౌకర్యాలను కూడా కల్పించడం లేదు.
అందుకే నియోజకవర్గంలో ఉప్పల్, కాప్రా ప్రాంతాలలో రెండు వందల పడకల ఆసుపత్రులను నిర్మించేందుకు కృషి చేస్తాము.
వీటిల్లో కార్పొరేట్ తరహాలో వైద్యాన్ని పేదలకు, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా అందేలా చేస్తాను.

చెరువుల సుందరీకరణ
ఉప్పల్ కాప్రా ప్రాంతాలలో ఉన్న చెరువులు కాలుష్యంతో నిండిపోయాయి.
ఇదే కాకుండా ఈ చెరువులన్నీ కూడా కబ్జాలకు గురవుతున్నాయి.
ప్రతి చెరువును కబ్జాల నుంచి రక్షించి సుందరీ కరణ చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దెలకు కృషి చేస్తాను.

మహిళల కోసం
నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో మహిళా భవన్ లో నిర్మాణం చేసి అందులో మహిళలకు అన్ని రకాల శిక్షణ ఇచ్చి వారిని స్వయం ఉపాధి రంగాలలో రాణించేలా కృషి చేస్తాను.
మహిళా సాధికారత లక్ష్యంగా చేయూతను ఇస్తాను.

రోడ్లు, డ్రైనేజీలో అభివృద్ధి..

నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో సిసి రోడ్లు నిర్మాణం, ఇదేవిధంగా భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేసి కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తాను.

ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్ల అభివృద్ధి

నియోజకవర్గంలో ఎక్కడ అప్పుడు ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఇందుకోసం అవసరమైన చోట్ల ఫ్లైఓవర్ ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చేస్తాము.

ట్రాఫిక్ చలాన్లు ఉండదు
వాహనం తీసుకొని రోడ్డుపైకి రావాలంటే వాహనదారులు భయభ్రాంతులను అవుతున్నారు. దీనికి కారణం ట్రాఫిక్, సాధారణ పోలీసుల వేధింపులే కారణం. రకరకాల సాకులను చూపుతూ వాహనదారుల గురించి చలాన్ రూపంలో భారీగా వసూళ్లను చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి రావడం ట్రాఫిక్ చలానా వేధింపులు అనేవి లేకుండా చేయడం జరుగుతుంది.

Spread the love