అలక వీడిన హస్తం నేతలు

రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు
రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు
– సద్దుమణిన అసంతృప్తి వర్గం
– గెలుపే లక్ష్యంగా హస్తం నేతల ఐక్యతా రాగం
–  గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచన
నవతెలంగాణ-బోడుప్పల్: 
ఎమ్మెల్యే సీటు విషయంలో అసంతృప్తిగా ఉన్న జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి ఎట్టకేలకు సమ్మతించారు. ఈ మేరకు టీ.పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి హరివర్దన్ రెడ్డి నివాసానికి వెళ్ళి పార్టీలో సమాజిక సమీకరణాల వలన కొందరికి టికెట్ రాలేదని నచ్చచెప్పి భవిష్యత్తులో పార్టీ అన్ని రకాలుగా చూసుకుంటుందని అందుకోసం మనందరం ఐక్యాంగా పనిచేసి పార్టీని గెలిపించాలని సూచించారు. అనంతరం మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్ తో కలిసి హరివర్దన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లి పార్టీని గెలిపించేందుకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ మీరంతా ఐక్యంగా పనిచేసి మల్లారెడ్డిని ఓడించాలని సూచనలు చేశారు. రేవంత్ రెడ్డి హమీ మేరకు ఇక అందరం కలిసి పనిచేస్తామని హమీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు.
Spread the love