– బోడుప్పల్ కార్పొరేషన్ లో జోరుగా గడప గడపకు కాంగ్రెస్
– ప్రజల నుండి విశేష స్పందన
– ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా – వజ్రెష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కధం తొక్కుతూన్నారు.బుధవారం నాడు నియోజకవర్గంలోని బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ యేనని అన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కి ఓటేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వెంటనే బోడుప్పల్ లో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. మొదట బంగారు మైసమ్మ దేవాలయం నుండి మొదలైన పాదయాత్ర వీరారెడ్డి నగర్, అర్ ఎన్ ఎస్ కాలనీ,టెలిఫోన్ కాలనీ, పీఎన్అర్ కాలనీ,రాజలింగం కాలనీల మీదుగా సాగిన యాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు వివిధ కాలనీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ మేడ్చల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సింధుజ రాణి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొన్నం తరుణ్ గౌడ్,మేడ్చల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త సుశాంత్ గౌడ్,మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ,కొత్త స్రవంతి కిషోర్ గౌడ్,తోటకూర అజయ్ యాదవ్,బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శిలు కొత్త ప్రభాకర్ గౌడ్,విశ్వం గుప్త,హైదరాబాద్ జిల్లా మాజీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వరలక్ష్మి, సీనియర్ నాయుకులు బాలరాజ్ గౌడ్,రాపోలు శంకరయ్య,నర్సింగ్ రావు గుప్త,బొమ్మక్ రమేష్,వెంకటేష్ గుప్త పోగుల వీర రెడ్డి,సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,కుర్రి శివ శంకర్,తోటకూర అశోక్ యాదవ్,గీత రెడ్డి,హరినాథ్ రెడ్డి,పోగుల దిలీప్ రెడ్డి,తోటకూర రాజు యాదవ్,శ్రీనివాస్ రెడ్డి,జ్ఞానేశ్వర్,రాపోలు ఉపేందర్,సింగిరెడ్డి రాజు రెడ్డి,రసాల కుమార్ యాదవ్, పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి,దుడేళ్ల రాజు ముదిరాజ్,బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరప్ప,రాపోలు రామస్వామి,ఏ రాములు,పొన్నం సాయి గౌడ్, చీరాల జంగయ్య,అమరేందర్ రెడ్డి అఫ్జల్ ,మురళి నాయక్,హరి కృష్ణ గౌడ్,సూరి,తదితరులు పాల్గొన్నారు