ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయంలో ఐటి సోదాలు

నవతెలంగాణ -హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కార్యాలయంలో ఆదాయపన్నుశాఖ సోదాలు చేపట్టింది. బుధవారం ఉదయం నుండి ఐటీ బృందం అభిషేక్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. లావాదేవీలు, పన్ను చెల్లింపుల రికార్డులను ఐటి అధికారులు పరిశీలిస్తున్నారు. కాశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2 వంటి పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలను అభిషేక్‌ నిర్మించిన సంగతి విదితమే. కాగా ఈ బ్యానర్‌లో మాస్‌ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కానుంది. ఈ చిత్రం రిలీజ్‌కు కొద్ది రోజుల గడువు మాత్రమే ఉండగా… అభిషేక్‌ కార్యాలయంలో ఐటి సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

Spread the love