మండల వాసులకు జాతీయ ఉత్తమ పురస్కారాలు

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రానికి చెందిన స్వేరోస్ నెట్ వర్క్ జిల్లాధ్యక్షుడు ఉప్పులేటి బాబు,సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేశ్ జాతీయ ఉత్తమ పురస్కారాలు శనివారం హైదారాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందుకున్నారు. సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టినందుకు ఉప్పులేటి బాబుకు సామాజిక సేవ, కార్మికుల సమస్యల పరిష్కారం పోరాట కార్యక్రమాలకు బోనగిరి రూపేశ్ కు కార్ల్ మార్క్స్ ఉత్తమ జాతీయ పురస్కారాలను బహుజన సాహిత్య అకాడమీ అధ్వర్యంలో అందజేశారు. జాతీయ పురస్కారాలు అందజేసిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధ కృష్ణ,రాష్ట్రాధ్యక్షుడు  బడే వెంకటేశంకు పురస్కార గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love