నవతెలంగాణ – నవీపేట్
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నాలేశ్వర్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ సరీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి 6 నుండి10వ తరగతి విద్యార్థులు సైన్స్, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ వర్కింగ్ మోడల్స్ భూ చలనాలు, ఋతువులు, పర్యావరణం, జల చక్రం, అగ్నిపర్వతాలు, వివిధ అంశాలను తయారు చేశారు. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీదీప్, ఉపాధ్యాయలు సంజీవరావు, గంగాధర్,సాగర్ ,రత్నయ్య, శ్రీనివాస్, వైశాలి, విశ్వనాథ్ సంతోష్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.