కార్పొరేటర్ నిర్లక్ష్యం..

– ఎమ్మెల్యేకు సమస్యలపై వినతి
నవతెలంగాణ కంటేశ్వర్
 నగరంలోని వినాయక్ నగర్, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ లో నీ వాటర్ ట్యాంక్ ప్రాంతంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త కు వినతి పత్రం అందజేశారు. వాటర్ ట్యాంక్ వద్ద డ్రైనేజ్ నిర్మించక పోవడం వల్ల మురికి నీరు నిలిచి పోతుంది. దీనివల్ల దోమలతో రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే ఖాళీ స్థలంలో పార్క్ నిర్మించక పోవడం వల్ల చెట్ల పొదలు, వర్షం నీరు నిలిచి విష సర్పాలు ఇండ్లలోకి వస్తున్నేయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై పలు మార్లు స్థానిక కార్పొరేటర్ కు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, నిధులు కేటాయించి తొందరలో సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళ సంఘం నాయకులు సబితా, స్వప్న, అనసూయ, కాలనీ వాసులు గోపి, గోవర్ధన్, వెంకటేష్, శ్రావణ్, ఫారూఖ్ బాయ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love