టీ20 క్రికెట్‌ లో చరిత్ర సృష్టించిన నేపాల్

నవతెలంగాణ- హైదరాబాద్: నేపాల్ క్రికెట్‌ జట్టు టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసి చరిత్ర సృష్టించింది.. ఆసియా గేమ్స్ 2023 గ్రూప్ దశలో భాగంగా బుధవారం మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఏకంగా 314 రన్స్ చేసింది. నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 314 భారీ స్కోరును సాధించింది. 300లకు పైగా స్కోర్ చేసిన మొదటి జట్టుగా అవతరించడమే కాకుండా.. టీ20ల్లో చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నేపాల్ రికార్డుల్లో నిలిచింది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ పేరుపై ఉన్న రికార్డు బద్దలైంది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ కుషాల్ మల్లా 34 బంతుల్లోనే శతకం బాది ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేస్తే.. మరో బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(12 బంతుల్లో) రికార్డును బద్దలు కొట్టాడు.

Spread the love