మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జిగా నేరళ్ల ప్రభుదాస్   

నవతెలంగాణ – చండూరు 
బహుజన్ సమాజ్ పార్టీ 93 మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జిగా  నేరళ్ల ప్రభుదాస్  ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్  నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా అధ్యక్షులు ఏకుల రాజారావు  ఆధ్వర్యంలో ఇటీవల నల్గొండలో నిర్వహించిన సన్నాక సమావేశంలో ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   తనకు ఇచ్చిన బాధ్యతలను బహుజన సమాజం పట్ల సబ్బండ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీ అగ్రకుల పేదల పక్షంగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని  తెలిపారు.  ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర కో -ఆర్డినేటర్ మంతపురి  బాలన్న,   ఉపాధ్యక్షులు దాగిళ్ళ  దయానంద్, ప్రధాన కార్యదర్శి మేడి ప్రియదర్శిని,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love