రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలుగా మారాయి 

నవతెలంగాణ – చండూరు  
రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలు గా మారాయని,నీతి నిజాయితీగా  ప్రజలకు సేవ చేయాలనుకునేవారు రాజకీయాలలో రాణించలేక పోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు.  శుక్రవారం చండూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ  ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు పార్టీ పెట్టగానే సామాన్య పేద వర్గాలకు చెందిన  యువకులను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చేసి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే  పెట్టుబడుదారులు  డబ్బులు ఖర్చు చేసి ఓట్లు వేయించుకొని  గెలిచిన తర్వాత పెట్టిన ఖర్చు సంపాదించుకోవడం కోసమే నాయకులు కష్టపడుతున్నారే తప్ప ప్రజాలకు సేవ చేసే పరిస్థితి నేడు లేదన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి  తెలుగుదేశంని తొమ్మిది నెలలోనే అధికారం తీసుకొచ్చి అనేక విప్లమాతమైన మార్పులు తీసుకొచ్చి ఒక చరిత్ర సృష్టించారని  తెలిపారు. పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ లాంటి వసతులు కల్పించడంతోపాటు బీసీలకు మహిళ లకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించి ప్రజాప్రతితులుగా ఎంపికయ్యే అవకాశం కల్పించి ప్రతి పెద వాడు ఆత్మగౌరంతో   జీవించే అవకాశం ఎన్టీఆర్ కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రజల్ల లింగయ్య, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మక్కెన అప్పారావు,పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎండి షరీఫ్, నాయకులు పుప్పాల యాదయ్య,గంట అంజయ్య తోకల యాదయ్య.  బోడ బిక్షం, పగిళ్ల రవీందర్,కావలి బిక్షం,కర్నాటి యాదగిరి,పొడపంగి సైదులు, సా ప్పిడి నరసింహ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love