పిల్లల మనోవికాసానికి కథలు దోహదం చేస్తాయి: చొక్కాపు వెంకటరమణ

నవతెలంగాణ – చండూరు
పిల్లల మనోవికాసానికి కథలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ అన్నారు. ఆదివారము హైదరాబాదులోని రవీంద్రభారతిలో బాల సాహిత్య పరిషత్తు, మాచిరాజు బాల సాహిత్య పీఠము సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన  బంతిపూలు, బహుమతి,  బాలల పుస్తకాలను రేవూరి అనంత పద్మనాభరావు  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ  కథలు చదవడం వల్ల విద్యార్థుల్లో  నైతిక విలువలు పెంపొందుతాయని, అందుకుగాను పాఠశాల గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. బాలసాహిత్యము విద్యార్థులకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వసుంధర దంపతులు, దాసరి వెంకటరమణ, మాచిరాజు కామేశ్వరరావు, ఉండ్రాళ్ల రాజేశం, సమ్మెట ఉమాదేవి, అమరవాది నీరజ, పెందోట  వెంకటేశ్వర్లు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love