నవతెలంగాణ కధనం ‘అంధకారంలో హై సెక్యూరిటీ ఏరియా’కి స్పందన

– పట్టణంలో ఎమ్మెల్యే జారే ఆకస్మిక పర్యటన…

ప్రధాన కూడళ్లు సందర్శన…
నవతెలంగాణ – అశ్వారావుపేట : నవతెలంగాణ లో సోమవారం ప్రచురితం అయిన “అంధకారంలో హై సెక్యూరిటీ” కథనానికి స్పందన లభించింది.ఈ కధనాన్ని పలువురు స్థానికులు వారి వాట్సాప్ లో స్టాట్స్ గా పెట్టుకోవడంతో పాటు నేరుగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు పంపారు.ఇది వైరల్ కావడంతో ఆయన నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో సంధ్యా సమయం లో పలు ప్రధాన కూడళ్లు ను ఆకస్మికంగా సందర్శించారు.క్యాంపు కార్యాలయంతో పాటు బస్ స్టాండ్ లో ప్రయాణీకుల ప్రాంగణం,వీధి వెంట చిరు వ్యాపారుల గుడారాలు ను ఆయన పరిశీలించారు.వ్యాపారం ఒడుదుడుకులు ను వారినే అడిగా స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సెంటర్ లైటింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేస్తామని దీంతో విద్యుదీకరణ తో వీధి దీపాలు సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.అలాగే ప్రజలు నుండి వారి సమస్యలు తెలుసుకోవడం కోసం పట్టణంలో ని రద్దీ ప్రదేశంలో పిర్యాదులు పెట్టె ను ఏర్పాటు చేసి దాని నిర్వహణకు ఒకరు ని నియామకం చేస్తానని తెలిపారు. ఆయన వెంట ఇ.ఒ హరిక్రిష్ణ,నాయకులు జూపల్లి ప్రమోద్,నండ్రు రమేష్ తదితరులు ఉన్నారు.
Spread the love