ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి

nine-people-died-in-a-fatal-road-accidentనవతెలంగాణ – రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని కతియా వద్ద ఆగి ఉన్న లారీని ఓ మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు బెమెతరా జిల్లా కలెక్టర్‌ రణ్‌వీర్‌ శర్మ చెప్పారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌కి తరలించామని వెల్లడించారు. బాధితులంతా ఓ శుభాకార్యానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.

Spread the love