నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్ బేడీ కార్మికులతో సమావేశం 

నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని మారుతి నగర్ లో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ బీడీ కార్మికులతో సమావేశమై వారి మద్దతు శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. బీడీల పై నిషేధం విధించడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ మోడీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు రాష్ట్రపతి వద్దకు వెళ్లి దాన్ని ఇప్పటికైతే ఆపగలిగాం. రాహుల్ గాంధీ గారు భారత జూడో యాత్రలో స్వయంగా బీడీలు చుట్టి వారి సమస్యలు తెలుసుకొని చలించిపోయారు వారికి మద్దతు తెలిపారు. తెలంగాణలో లక్షలాది కుటుంబాలు బీడీ పని తప్ప వేరే మార్గం లేదు, లక్షలాది మంది బీడీ కార్మికులు ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఈ జీవనోపాధిలోకి అడుగు పెట్టడం దీని ద్వారానే తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. సిగరెట్ కూడా పొగాకు సంబంధించిందే కదా దాన్ని రద్దు చేయకుండా పేదలకు జీవన ఉపాధి కల్పించే బీడీ వ్యవస్థను రద్దుచేసి లక్షలాది కుటుంబాలను సిగరెట్ కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై పేదల జీవితాలను రోడ్డుపాలు చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీడీ కార్మికులను ఆదుకొని వారి కి ఆరోగ్య భద్రత కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటాం. మాది ఒకటే డిమాండ్ బీడీ పరిశ్రమను రద్దు చేస్తే దానికి రెండింతలు ఆదాయం వచ్చే భరోసా కల్పించిన తరువాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. బీడీ కార్మికులంతా ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ ఇల్లు కట్టించి వారి పిల్లలకు సరైన విద్యా వైద్యం అందే విధంగా సహకరించి వారి కుటుంబాలను ఆదుకుంటాం అని తెలియజేశారు.
Spread the love