పార్టీ ఏదైనా ఎజెండాలు ఎన్ని ఉన్నా ఎగిరేది గులాబీ జెండే

నవ తెలంగాణ- తిరుమలగిరి: నియోజకవర్గంలో పదేళ్ల తెలంగాణ ప్రస్థానం గణనీయమైన అభివృద్ధితోపాటు శతాబ్ది కాలంలో జరగని పనిని దశాబ్ద కాలంలో చేసి చూపించి తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి మోడల్ గా నిలిపిన గులాబీ జెండా ఉండగా నియోజకవర్గంలో ఏయే పార్టీలు వచ్చినా ఎన్ని ఎజెండాలు ఉన్నా ఎగిరేది గులాబీ జెండా అని బీఆర్‌ఎస్‌ పార్టీ సూర్యాపేట జిల్లా యూత్ నాయకులు కందుకూరి ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో 2014 ముందు నెర్రెలు బారిన నేల, విద్యుత్ వనరులు లేని చీకటి, ఆకలి డొక్కల దళిత వాడలు, విత్తుల జాడే తెలియని సాలు ఇరువాళ్లు ఆగమ్య గోచరంగా యువత భవిత ఇది పదేళ్ల క్రితం, 2014 తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జలాలు నియోజకవర్గం నకు తీసుకొచ్చి 24 గంటల కరెంటు ఇవ్వడంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు అన్ని సస్యశ్యామలం అయ్యి పచ్చని పైర్లతో విరజిల్లుతున్నాయంటే దానికి కారణం బీఆర్‌ఎస్‌ పార్టీ అన్నారు. 9 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి గ్రామాలు తండాల రూపు రేఖలు మార్చి ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములకు కాలేశ్వరం గోదావరి నీళ్లు అందించి లక్ష ఎకరాలను సాగులోకి తీసుకొచ్చి, చిన్న పెద్ద పాత కొత్త తరాలను కలుపుకుపోతూ విమర్శలకు తావు లేకుండా నిత్యం ప్రజల్లో ఒకరిగా ఉంటూ, సమస్యలను ప్రత్యక్షంగా చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తూ, ప్రజలు ఏది అడిగినా కాదనకుండా నేను ఉన్న అంటూ భరోసా కల్పిస్తూ నియోజకవర్గాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసిన గాదరిదే మరో మారు విజయం అని ఎగిరేది గులాబీ జెండే అని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, కళ్యాణ లక్ష్మి, పల్లె దావకానాలు, ఎస్సి, బిసి ఎస్టి మైనార్టీస్ కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయల సహాయం, సబ్ స్టేషన్లు, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ నిధులు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, గురుకులాల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, మున్సిపాలిటీల ఏర్పాటు, కమ్యూనిటీ భవనాలు, దళిత బందు, బీసీ బందు లాంటివి నియోజకవర్గంలో ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాల కింద 2168.00కోట్ల రూపాయలు, సంక్షేమ పథకాల ద్వారా 3473.73 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసి నియోజకవర్గంలో మొత్తం 5641.73 కోట్ల రూపాయలు అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసి తుంగతుర్తి చరిత్రలో లేని విధంగా పరిపాలన సాగించి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ తుంగతుర్తి అనే విధంగా చేసి చూపించారన్నారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇంత అభివృద్ధి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందిన తుంగతుర్తిలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ఎజెండాలు ఉన్నా ఎగిరేది గులాబీ జెండా అని బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని అన్నారు.

Spread the love