బీఆర్‌ఎస్‌ ఎన్ని చిమ్మికులు చేసినా మెదక్‌ ఎంపీ స్థానంలో గెలిచేది కాంగ్రెస్సే

– యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్‌ఖాన్‌
నవ తెలంగాణ- గజ్వేల్‌
బీఆర్‌ఎస్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసి నా మెదక్‌ పార్లమెంటు స్థానం కాం గ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్‌ఖాన్‌ అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని బీఆర్‌ఎస్‌ తుంగలో తొక్కి ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళ్లిందన్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా మేలుకోలేకపోతున్నారన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజలు దొరపోకోడలకు విసిగిపోయి ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించినట్లు చెప్పారు. అయినా బీఆర్‌ఎస్‌ నాయకులు తమ పద్ధతి మార్చుకోవడం లేదన్నారు. ఓటమిపై ఆత్మ పరిశీలించిన చేసుకోకుండా ఓటమికి ప్రజలదే తప్పు అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ హయాంలో తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి మీడియా గొంతునొక్కి ప్రజల పక్షాన పోరాటం చేసిన వారిపై ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనయించిన బీఆర్‌ఎస్‌ నాయకులు ముసలి కన్నీరు పెడుతున్నారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి బీఆర్‌ఎస్‌ను నామరూపాలు లేకుండా చేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో అజ్గర్‌, సుదర్శన్‌, సమీర్‌, డప్పు గణేష్‌, అహ్మదీపూర్‌ బాల గౌడ్‌, మామిడ్యిలా ఆంజనేయులు పాల్గొన్నారు.

Spread the love