సీతక్క గెలుపును ఎవరు ఆపలేరు

– పాలడుగు వెంకటకృష్ణ కాంగ్రెస్  మండల అధ్యక్షుడు
నవతెలంగాణ-గోవిందరావుపేట: అసెంబ్లీ ఎన్నికలు సీతక్క గెలుపును ఎవరు ఆపలేరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రం తో పాటు చల్వాయి, పస్ర, బాలాజీనగర్, కర్లపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు గురించి ప్రజలకి  తెలియజేస్తూ ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు లబ్ధిదారుల్లో సైతం బీఆర్‌ఎస్‌ నాయకుల అక్రమాలు వెలికి తీసి అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామనిప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దేనని మాజీ మంత్రి చందులాల్ పై 23 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ సాధించిన సీతక్క ఈసారి 50వేల పైచిలుకు మెజారిటీ సాధిస్తుందని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కరోనా వంటి కీలక సమయాల్లో క్లిష్ట పరిస్థితుల్లో సమాజానికి సీతక్క చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తించుకున్నారని సీతక్క చేసిన సమాజ సేవ వరల్డ్ మ్యాగజైన్ బుక్కులో చోటు సంపాదించిందని అన్నారు.  తేళ్ల హరిప్రసాద్, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, గోపిదాసు ఏడుకొండలు, జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి జంపాల చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, సూరినేని సుధాకర్, కణతల నాగేందర్ రావు, రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, పులుగుజ్జు వెంకన్న, పన్నాల ఎల్లారెడ్డి, దేపాక కృష్ణ, బద్దం లింగారెడ్డి, భూక్యా సుక్యా, మట్ట వెంకటపాపి రెడ్డి, రసపుత్ సీతారాంనాయక్, చింత క్రాంతి, తండా కృష్ణ, కాడబోయిన రవి, భూక్యా సారయ్య, భూక్యా రాజు, పాడియ రాజు, కుంజా కృష్ణ, అలుగుబెల్లి కన్నయ్య, సనప సమ్మయ్య, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, బొల్లు కుమార్, సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, సామ హనుమంత రెడ్డి, మద్దాలి నాగమణి, సూది రెడ్డి జయమ్మ, వేల్పుగొండ ప్రకాష్, నాయిని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love