సీతక్కను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: తుడుందెబ్బ 

– మండలంలో విస్తృత ప్రచారం
నవతెలంగాణ- తాడ్వాయి: కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, తుడుందెబ్బ జిల్లా నాయకులు కోరగట్ల లక్ష్మణరావు, కుంజ నారాయణ, పాయం కోటేశ్వరరావు, పోదెం నాగేశ్వరరావులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కు మద్దతుగా గత రెండు రోజుల నుండి మండలంలోని బీరెల్లి, రంగాపురం, కాటాపుర్, గంగారం, బంజర, లింగాల, బంధాల, బొల్లెపల్లి తదితర గ్రామాలలో సీతక్కకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టం వచ్చినా, కరోనా వచ్చినా, కన్నీళ్లు వచ్చినా మనందరికీ అండగా ఉన్నది సీతక్కే అని, ఓట్లు రాగానే వచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకులను నమ్మి, మరో మారు మోసపోవద్దని తెలిపారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎవరికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ కార్డులు అమలు చేస్తారని పేర్కొన్నారు. నియంత పాలను అంతమొందించి పేదల పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు అన్నేబోయిన సమ్మయ్య, ఈక నరసయ్య, ఎట్టి సారయ్య, నారాయణ, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love