నన్ను కలవడానికి ఎవరి అపాయింట్మెంట్‌ అవసరం లేదు

– ప్రజలతోనే ఉన్న సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-వేంసూరు
నన్ను కలవడానికి ఎవరి అపాయింట్మెంట్‌ అవసరం లేకుండా నిత్యం ప్రజలతోనే ఉన్నానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. బుధవారం మర్లపాడు, వేంసూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వ్యాపార కూడలిలో ప్రజలను కలుసుకుని తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వ్యాపారస్తులను కోరారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ప్రతి సమస్య నా సమస్యగా భావించి ప్రజలతోనే మమేకమై ఇప్పటివరకు ఉన్నానని ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తే నీతోనే ఉంటానని అన్నారు. మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, గుత్తా శ్రీనివాసరావు, కంటే వెంకటేశ్వరరావు, మందపాటి వేణుగోపాల్‌ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కోటేశ్వరరావు, సురేష్‌, రావూరి శ్రీనివాసరావు నూనె హరిబాబు తదితరులు ఉన్నారు.

Spread the love