అనుమతి లేదు అనుభవం లేదు.. చిన్నపిల్లల డాక్టర్ గా చలామణి.. ఆస్పత్రి సీజ్ 

– అనుమతి లేదు అనుభవం లేదు.. చిన్నపిల్లల డాక్టర్ గా చలామణి. ఆస్పత్రిని సీజ్  చేసిన వైద్యాధికారులు
నవతెలంగాణ- అచ్చంపేట:  అనుమతి లేదు… అనుభవం లేదు.. చరితసాయి చిన్నపిల్లల నిర్వహిస్తూ… డాక్టర్ గా విష్ణుమూర్తి  చలామణి. అవుతున్నాడు. అప్పారావు అనే పేరు మీద ఆస్పత్రి ఆనుమతి తీసుకొని  నిబ్బందులకు విరుద్ధంగా మరో పేరు గల వ్యక్తి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల ప్రాణదాత అంటూ చెప్పుకుంటూ.. ఐ డోస్ వ్యాక్సిన్, సెలైన్ బాటిల్ వెక్కిస్తున్నారని పట్టణంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ గా పనిచేస్తూ..మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అండదండలతో ఆస్పత్రి నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. 2021 వరకే ఆస్పత్రికి అనుమతి ఉందని ఇప్పటివరకు రెన్యువల్ చేయించుకోలేదు. జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆస్పత్రిని, ల్యాబ్ ను వైద్యాధికారులు సీజ్ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తారాసింగ్ వైద్య సిబ్బంది ఉన్నారు.

Spread the love