వేధింపులకు గురైన మైనర్ బాలిక ఆత్మహత్య..

 నవతెలంగాణ-రేవల్లి : గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన హనుమంతుకు ఒక కొడుకు ఒక కూతురు, కూతురు దీపిక ( 15 ) ఊరిలో తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకుని, పదవ తరగతి చదవడానికి నాగర్ కర్నూల్ జిల్లాలలో వాళ్ళ చిన్నమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటుంది, గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురవడంతో స్కూల్ కి సెలవులు ఇచ్చారు, దీపిక గౌరీదేవి పల్లి తన సొంత గ్రామానికి వచ్చింది, ఆదివారం రోజున దీపిక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది ” రేవల్లి మండల ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ” దీపిక ఉన్న ఇంటి పక్కన శ్రీశైలం ( 22 ) అబ్బాయి ఇల్లు వుంది, శ్రీశైలం ప్రతిరోజు దీపిక దగ్గర తరచుగా మాట్లాడుతూ నన్ను ప్రేమించు అని వెంటపడి వేధింపులకు గురి చేశాడు, దీంతో బాలిక తన ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేక ” భయంతో ” పొలంలో కొట్టే పురుగుల మందు ఇంట్లో ఉండడం చూసి పురుగుల మందు తాగింది, ఇది గమనించిన దీపిక ( అన్నయ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి తేల్పగా ) తల్లిదండ్రులు వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు, చికిత్స పొందుతూ బాలిక సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది, తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని వనపర్తి న్యాయవ్యవస్థలో ప్రవేశపెట్టగా కోర్టు ( 14 ) రోజులు మహబూబ్ నగర్ కు రిమాండ్ చేశారని ఎస్సై శివకుమార్ తెలిపారు.

Spread the love