న్యాయం చేయండి…

2003-డీఎస్సీలో అన్యాయానికి గురైన అభ్యర్థులు న్యాయం కోసం అభ్యర్థిస్తుంటే ఆ సమస్యను మఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లే నాథుడే కరువయ్యారు. సకాలంలో డీఎస్సీ ఫలితాలొచ్చినా నియామకాలు రెండేండ్లు ఆలస్యమయ్యాయి. దీంతో ఉద్యోగులు పాతపెన్షన్‌ కోల్పోయారు. కొత్త పెన్షన్‌లోకి నెట్టబడ్డారు. ఈ విషయమై సుప్రీంకోర్టు ఈ మధ్య రాజకీయ కారణాలతో ఫలితా లొచ్చినా నియామకాలు ఆలస్యమైనవారికి పాత పెన్షన్‌ వర్తింపచేయాలని చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినప్పటికీ న్యాయం జరగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టం జరిగిందని భావించిప్పటికీ కొత్తరాష్ట్రంలో సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఈ విషయంలో కాలయాపన చేయడం సరైంది కాదు. సుప్రీం ఇచ్చిన తీర్పును కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నా ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంతోమంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లను క్రమబద్ధీ కరించి, వివిధ శాఖల్లో గెజిటెడ్‌ సమానమైన పోస్టు లను కూడా క్రమబద్ధీకరించిన ప్రభుత్వం ఇలాంటి న్యాయపరమైన అంశాల్లో జాప్యం చేయడం తగదు. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి జీఓ నెం.57ను అర్హులందరికీ వర్తింపజేసి న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నాను.
– సి.శేఖర్‌, 9010480557.

Spread the love