మాధారంలో వరుస దొంగతనాలు..

– భయాందోళనలో గ్రామస్తులు..
నవతెలంగాణ – ఊరుకొండ 
ఊరుకొండ మండల పరిధిలోని మాదారం గ్రామంలో గత మూడు రోజులుగా వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాదారం గ్రామానికి చెందిన అంకూరి దుర్గ నివాసంలో ఈనెల 22 రాత్రి తాళం వేసిన ఇంటిలో ప్రవేశించి తులం బంగారం, 50 వేల నగదును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారని వాయిదాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా.. అది మరవక ముందే  ఈ నెల 24 రాత్రి లస్కర్ రాధాబాయి ఇంటిలో దొంగలు బడి రెండు తులాల బంగారు బిల్లలు కొంత నగదును తాళం విరగొట్టి ఇంటిలోని బీరువా పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు దొంగిలించినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.లెనిన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై లెనిన్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలు తాము ఊరికి వెళుతున్నప్పుడు తప్పనిసరిగా సమాచారం పోలీసులకు తెలియజేయాలని.. చుట్టుపక్కల వారికి కూడా పరిశీలించే విధంగా సమాచారం ఇవ్వాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే దొంగతనాలు జరగకుండా చూడవచ్చని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Spread the love