కుక్కలతో బెంబేలు..

నవతెలంగాణ – చిన్నకోడూరు

నడి రోడ్డుపై కుక్కలు గుంపులు గుంపులుగా ఉండటం, వెంటపడి మొరగడంతో ద్విచక్ర వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రతినిత్యం చిన్నకోడూరు నుండి సిద్దిపేటకు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. వెలుతురు వేలల్లోనే కుక్కలను చూస్తే భయపడే ప్రజలు, రాత్రి వేళల్లో గజగజ వణికి పోతున్నారు. కొన్ని సందర్భాల్లో ద్విచక్ర వాహనదారుల వెంటపడి ప్రమాదాలు సంబంధించిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల చిన్నకోడూరు మండలం సలేంద్రిలో ఓ మహిళపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. సర్జరీ తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడింది. మండలంలోని గ్రామాలలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని చెప్పడానికి ఇదో నిదర్శనం. కుక్కల దాఢి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమై వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
Spread the love