దారిలేని ప్రభుత్వ జూనీయర్ కాలేజీ

– పట్టించుకోని ప్రజాప్రతినిధులు
– తాత్కలిక మట్టి రోడ్డు పట్టా భూమి నుండి వేసారు
– వర్షకాలంలో ఇక నరకమే
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ రోడ్డు వద్ద మేాడల్ తెలంగాణ జూనీయర్ కాలేజీ విశాలంగా అన్ని హంగు అర్బాటాలతో  రూ” కోట్లాదీతో నిర్మాణం చేసారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా కాలేజీ పరిస్థితి నెలకొంది. ప్రభూత్వ స్థంలో నిర్మాణం చేసినప్పడికి దారీ లేకుండానే  భవన నిర్మాణం చేసారు. పక్కనే ఉన్న  కాలువ నుండి కాలేజీ వరకు కాలీనడకన వెళ్లేందుకు గుంతలమయంగా ఉన్న దారీ వేసారు. కొన్నేండ్లుగా కోనసాగుతున్న క్రమంలో జుక్కల్ చౌరస్తా నుండి జుక్కల్ వరకు రెండు వరుసల రోడు వేసే క్రమంలో కాలువ పక్కన ఉన్న రోడు కు అడ్డంగా బ్రిడ్జీ నిర్మాణం చేసారు. దారీ ముసుకో పోవడంతో విద్యర్థులకు ఇక్కట్లు మెుదలయ్యాయి. దారీలేక పోవడంతో  స్థానిక నాయకులు పట్టాభూమీ లేదా ప్రభూత్వ భూమీ తెలియని స్థలం మీదుగా   నుండి తాత్కాలికంగా రోడు వేసారు.  వర్షకాలంలో  వచ్చిదంటే విద్యార్థులు మేాకాలీ లోతు నీరు, బురద దాటీ పోవాల్సిన దపస్థితి నెలకొంది . కొత్త కాంగ్రేస్ ప్రభూత్వ హయంలో నైన  ఎమ్మెలే స్పందించి సిసి రోజు నిర్మాణం చేయించాలని కాలేజీకీ వెళ్లేందుకు దారీవేయాలని  విద్యార్థి సంఘం నాయకులు, విద్యర్థులు  కోరుతున్నారు.

Spread the love