– బీఆర్‌ఎస్ పరిరక్షణ కోసమే : టీడీపీ విమర్శ
నవతెలంగాణ -హైదరాబాద్
సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తెలంగాణలో బీఆర్‌ఎస్, ఆంధ్రలో జగన్ రాజకీయలబ్ధి పొందేందుకు కేసీఆర్ కృష్ణా జలాలపై డ్రామా నడిపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం నల్లగొండలో కేసీఆర్ నిర్వహించే సభ కృష్ణా జలాల పరిరక్షణ కోసం కాదనీ, తన పార్టీ బీఆర్‌ఎస్ పరిరక్షణ కోసమమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఛీత్కారనికి గురైన కేసీఆర్, తన పార్టీ ఎమ్మెల్యేలు, క్యాడర్‌ను కాపాడుకోవడం కోసమే కృష్ణా జలాల పేరుతో సభ నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అంతే కాకుండా మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్ ఏపీ పోలీసుల చేత ఆక్రమించుకొని సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి బీఆర్‌ఎస్‌కు లబ్దిచేయాలని చూశారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కష్ణా జలాల పరిరక్షణను విస్మరించి, ఇప్పుడు రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. ప్రాజెక్టులకు పూర్తి చేయకుండా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.