-విద్యాలయం వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల అందోళన
-చర్చనీయాంశంగా మారిన సిబ్బంది తీరు
-విద్యార్థి సంఘాల నాయకుల అగ్రహం
-సిబ్బందిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఏంఈఓకు పిర్యాదు
నవతెలంగాణ-బెజ్జంకి
ఆదర్శనీయంగా నిలిచిన ‘ఆదర్శ విద్యాలయం’ నేడు అభాసుపాలైంది.విద్యాలయంలోని సిబ్బంది అసభ్య ప్రవర్తనతో విద్యార్థులు పడిన మానసిక క్షోభ ఉగ్రరూపం దాల్చింది.విద్యార్థినిలపై అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బందిపై విద్యార్థినిల తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాల నాయకులు అక్రోశం వెల్లగక్కుతూ సోమవారం ఆదర్శ విద్యాలయాన్ని ముట్టడించి సిబ్బందిపై తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టి విద్యాలయాన్ని పరిరక్షించాలని అందోళన చేపట్టారు.సమాచారం తెలుసుకున్న ఎస్ఐ తోట తిరుపతి విద్యార్థి సంఘాల నాయకులు,విద్యార్థినిల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థినిలపై అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని విద్యార్థినిల తల్లిదండ్రులు అగ్రహంతో పీడీపై దాడి చేసి దేహశుద్ధి చేశారు. విద్యార్థినిలపై అసభ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు చేపట్టేవరకూ ఉపేక్షించేదిలేదంటూ.. సిబ్బందిపై తక్షణమే విచారణ చేపట్టి చర్యలు చేపట్టి విద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావాలని తల్లిదండ్రులు ఏంఈఓకు రాతపూర్వకంగా పిర్యాదు అందజేశారు.
పట్టించుకోవడం లేదు: లోకటి సాన్వీ శ్రీ,విద్యార్థిని రాంసాగర్
తమపై పీఈడీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పలుమార్లు పిర్యాదు పెట్టెలో పిర్యాదును వేశాం.పిర్యాదు పెట్టెను పర్యవేక్షణించడంలో ప్రదానాచార్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పలుమార్లు సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదూ.క్రమశిక్షణ కరువైందని.. ఆదర్శను విద్యాలయమనరంటూ అసహనం వ్యక్తం చేసింది.
అంతర్గతంగా వివాదం..
ఆదర్శ విద్యాలయం ప్రారంభం నుండి గత రెండేళ్ల వరకు విద్యార్థులకు అందించే విద్యా బోధన, క్రమశిక్షణ,వివిధ కార్యక్రమాల్లో ఉన్నతమైన ప్రతిభ కనబర్చి మండలంలోని అయా పాఠశాలలకు ఆదర్శనీయంగా నిలిచింది.ఆదర్శనీయంగా నిలిచిన విద్యాలయం..నేడు స్థానికులు..స్థానికేతరుల సిబ్బంది మధ్య తలెత్తిన అంతర్గత మనస్పర్ధలు జటీలమై వివాదానికి దారితీసాయని పలువురు బాహంటంగానే చర్చించుకుంటున్నారు.
స్పష్టమైన అధికారుల పర్యవేక్షణ లోపం..
విద్యాసంవత్సరం ప్రారంభమైన నుంచి సంబంధిత అధికారులు పాఠశాలలను సందర్శించి నెలకొన్న సమస్యలను పసిగట్టి పరిప్కరించడంలో విఫలమయ్యారు.ఆదర్శలో విద్యార్థినిల తల్లిదండ్రులు చేపట్టిన అందోళన అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టమవుతోంది.ఇప్పటికైనా జిల్లా,మండల విద్యాశాఖాధికారులు ప్రతి పాఠశాలను సందర్శించి బోధన సిబ్బంది మధ్య సమన్వయం,నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తే విద్యార్థులు తమ చదువును అటంకాల్లేకుండా విద్యను సాగిస్తారు.
ఏడునెళ్లుగా మానసిక క్షోభకు గురవుతోంది: పాయిరాల మమత, విద్యార్థిని తల్లి, తోటపల్లి
ఆదర్శ విద్యాలయంలో నా కూతురు పదో తరగతి చదువుతోంది.పీఈటీ వ్యవహరించిన అసభ్య ప్రవర్తనతో ఏడునెళ్లుగా మానసిక క్షోభకు గురవుతోంది.అసభ్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తక్షణమే చర్యలు చేపట్టాలి.
ఏనాడూ దృష్టికి తీసుకురాలేదు..–మాలోతు సంగీత, ప్రధానాచార్యులు
విద్యార్థినిలపై పీఈడీ అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు ఏనాడూ నా దృష్టికి తీసుకురాలేదు. గత రెండ్రోజుల క్రితమే తల్లిదండ్రుల ప్రత్యేక సమావేశం నిర్వహించాం. విద్యాలయ ప్రతిష్టకు భంగం కలగకుండా పీఈడీ అసభ్య ప్రవర్తనపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులకు నివేదిక అందజేస్తాను.
పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను: మహతి లక్ష్మీ,ఏంఈఓ బెజ్జంకి
ఆదర్శ విద్యాలయంలో పీఈడీ,ప్రదానాచార్యులు విద్యార్థినిలపై వ్యవహరించిన తీరుపై ప్రత్యేక విచారణ చేపట్టి పై అధికారులకు నివేదిక అందజేస్తాను.



