Tuesday, July 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
ముధోల్ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం నూతన కార్యవర్గాన్ని సోమవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మండల ఉపసర్పంచ్‌ల ఫోరం గౌరవాధ్యక్షులుగా ఎడ్ బిడ్ తాండ ఉపసర్పంచ్ జాదవ్ అంబర్ సింగ్, అధ్యక్షుడుగా కారేగాం గ్రామానికి చెందిన నర్సరెడ్డి, ఉపాధ్యక్షుడిగా చించాలకు చెందిన పీసర సాయినాథ్ గౌడ్, కార్యదర్శులుగా తరోడాకు చెందిన కే. రజిత హనుమంతరావు, భోరిగాంకు చెందిన కే. సవిత, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏడ్ బిడ్‌కు చెందిన ఎం. భూమన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సలహాదారులుగా బ్రహ్మంగావ్‌కు చెందిన రాజుల రఘునాథ్, ముద్గల్‌కు చెందిన జే. గోపాల్, ఆష్ట గ్రామానికి చెందిన సావిత్రి భోజన్న, విట్టోలి తాండాకు చెందిన గజానంద్ రాథోడ్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడానికి సమిష్టిగా పోరాడుతామని పేర్కొన్నారు. జిల్లా సంఘం నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపసర్పంచ్‌లు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -