
శంకరపట్నం మండల పరిషత్ ఆవరణలో గురువారం ఎంపీపీ ఉమ్మెంతల సరోజన ఆధ్వర్యంలో సర్పంచుల కు సన్మాన సభను నిర్వహించి సర్పంచులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపీపీ సరోజన మాట్లాడుతూ,గత ఐదు సంవత్సరాలలో సర్పంచులు, గ్రామాలను స్వచ్ఛస్శ్యామలంగా తీర్చిదిద్దారని సర్పంచులకు బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడ్డారని కరోనా కష్టకాలంలొ కూడా ధైర్యంగా ముందుండి సేవలందించారని ఆమె సర్పంచ్ లను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి,వైస్ ఎంపీపీ పులికోట రమేష్, ఎంపీటీసీల పురం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,ఎంపీడీవో,శ్రీ వాణి,ఎంపీఓ బసిరుద్దీన్, ఆర్ఎస్ డబ్ల్యూ మొగిలి, పంచాయతీరాజ్ ఏఈ తిరుపతి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,గ్రామపంచాయతీ కార్యదర్శులు,కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.