మరోసారి అభివృద్ధికి ఓటేయండి

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
మరోసారి ఆశీర్వదించండి, అభివృద్ధికి ఓటేయండి అని చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని సింగప్పగూడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కార్గీక్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ చేవెళ్ల పౌరుశాల గడ్డ అని, ఈ గడ్డపై కాంగ్రెస్‌, బీజేపీలు గల్లంతు కావడం ఖాయమన్నారు. భారీ మెజార్టీతో మరోసారి యాదన్నను గెలిచుకుందామని చేవెళ్ల ప్రజలకు పిలుపనిచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య మాట్లాడుతూ 150 చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి వ్యక్తికీ అవకాశం ఇచ్చిందంటే ఎంతకు దిగజిరిందో ప్రజలే గమనించాలన్నారు. ప్రజల కోసం కేసులు ఉంటే ఓకే..కానీ మనుషులను చంపిన కేసులు.. పరారిలో ఉన్న వ్యక్తి పేరుపైన 30 కేసులు ఉన్నాయాని ఆ పార్టీల వాళ్లు చెప్పుకోవడం గమనార్హం. మత తత్వల పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఊసరవెల్లి లా పార్టీలు మరే నాయకులకు ఓటు వేస్తే చేవెళ్ల అగమైతదని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి పూటకో పార్టీ మారితే, ఇంకా అభివృద్ధి ఎం చేస్తారని విమర్శించారు. మరోసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే హైదరాబాద్‌ తరహా చేవెళ్లను అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, చేవెళ్ల జడ్పీటీసీ సభ్యుడ రాలు మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్‌, వైస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మిట్ట రంగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు భీమయ్య, మల్లారెడ్డి, నడిమొళ్ల లావణ్యశంకర్‌, మోహన్‌ రెడ్డి, వెంకటేశం గుప్తా, సత్యనారాయణ చారి, మాజీ ఎంపీపీ బాల్‌ రాజు, మండల ప్రధాన కార్యదర్శి మల్గని నరేందర్‌ గౌడ్‌, మైనార్టీ జిల్లా నాయకులు అలీ, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మెన్‌ బ్యాగరి నర్సింలు, కౌకుంట్ల గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగార్జున రెడ్డి, అల్లవాడ గ్రామ వార్డు సభ్యులు నరేందర్‌ రెడ్డి, డైరెక్టర్లు కృష్ణ, వెంకటేష్‌, మాజీ డైరక్టర్‌ ఘనీ, సీనియర్‌ నాయకులు కృష్ణారెడ్డి, రమణారెడ్డి, ఎదిరి రాములు పాల్గొన్నారు.

Spread the love