Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

- Advertisement -

– నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ 
– బస్సాపూర్ గ్రామంలో 18 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్
నవతెలంగాణ – బాల్కొండ 
: ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ అన్నారు. మన ఊరు మన భద్రత కార్యక్రమంలో భాగంగా బుధవారం  బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్సాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 18 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్., ప్రారంభించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని గ్రామ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాసు ను అభినందించారు. ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు.

పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వారి భద్రత కోసం సి సి కెమెరా లను పెట్టాలని చెప్పారు. ఇది వారి భాద్యత గా తీసుకోవాలి. నగల దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలీ. బస్సాపూర్ గ్రామంలో 18 కెమెరాలు పెట్టి సహకరించిన గ్రామ పంచాయతీ ను సీపీ గారు అభినందించారు.ఈ సందర్భంగా బస్సాపూర్ గ్రామంలో డ్రగ్స్ నివారణ , సైబర్ క్రైమ్ పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం అన్నీ రకాల జాగ్రత్త లు తీసుకోవాలని అన్నారు. పంటపొలాలలో ఎవరు కూడా మంటలు పెట్టారాదని, అందుకోసం మల్టీ పోటాషియం మందులు వాడినట్టుయితే భూ సంద్రత బాగుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎసిపి  జె. వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ  జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ  శైలందర్, ఎంపీఓ  గంగాా మోహన్, శ్రీరాంపూర్ సర్పంచ్ పద్మ ఎర్రన్న, గ్రామ అభివృద్ధి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -