కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

నవతెలంగాణ -కామారెడ్డి: క్యాసంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. బస్సు ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడిని గుర్తించాల్సి ఉన్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Spread the love