నిలిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆధార్ ఈకేవైసీ పనిచేయకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో కార్యాలయాల ముందు జనం బారులు తీరారు. భూముల అమ్మకందారులు, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వరకు చాలా మంది కార్యాలయాల వద్ద ఉన్నారు. అయితే రోజంతా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదని అధికారులు ఎట్టకేలకు ప్రకటించారు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు వెనుదిరిగారు. ప్రధానంగా రెండు రోజులుగా సర్వర్లు మొరాయిస్తుండటంతో కార్యాలయాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తుండటం గమనార్హం.

Spread the love